'సింహా' ఆడియో రిలీజ్
నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 'సింహా' చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలకు ముస్తాబవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఈనెల 31న నేరుగా మార్కెట్ లోకి విడుదలవుతోంది. ఇటీవల మైసూరులో ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా ఎడమ కాలికి తీవ్రగాయం కావడంతో బాలకృష్ణ ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలికి మైనర్ సర్జరీ అనంతరం ఆయనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను రద్దు చేసి ముందుగా అనుకున్నట్టుగానే బుధవారం నుంచి మార్కెట్ లోకి ఆడియో రిలీజ్ చేయనున్నారు.
బాలకృష్ణ అభినయమే హైలైట్ గా ఈ చిత్రం ఉంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ మీసకట్టు ఇప్పటికే అందర్నీ ఆకర్షిస్తూ భారీ అంచనాలకు తావిచ్చింది. అందుకు తగ్గట్టే బాలకృష్ణ సరసన నయనతార, నమిత, స్నేహ ఉల్లాల్ ప్రధాన ఆకర్షణలుగా నిలువనున్నారు. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులను సుప్రీం అధినేత రాజు హర్వాణి చేజిక్కించుకుని 25కు పైగా ప్రింట్లతో అమెరికాలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 16న 'సింహా' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Be first to comment on this News / Article!
|