రిచా సొంత 'వెబ్ సైట్'
బాలీవుడ్ సినీతారలు సొంత వెబ్ సైట్లు ఏర్పాటు చేసుకోవడం, బ్లాగ్ లతో అలరించడం పరిపాటి. తెలుగులోనూ ఇప్పుడు పలువురు యువ హీరోలు, హీరోయిన్లు సొంత వెబ్ సైట్లు ఏర్పాటు చేసుకుంటూ తమ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. శేఖర్ కమ్ముల ఫైండింగ్ అయిన బెంగాలీ ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ్ ఇటీవల 'లీడర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. తాజాగా రవితేజ సరసన ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వలో రూపొందనున్న 'మిరపకాయ్' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించే అవకాశం రిచాను వరించింది. తెలుగులో కెరీర్ ఆశాహహంగా ఉండటంతో ఈ ముద్దుగుమ్మ సొంత వెబ్ సైటన్ ను ఏర్పాటు చేసుకుంది. www.richagangopadhyay.com పేరుతో ఏర్పాటైన ఈ వెబ్ సైట్ ను తాజాగా ఆమె ప్రారంభించారు.
రిచా వెబ్ సైట్ లో ఆమె ప్రొఫైల్, గ్యాలరీ, తాజా వార్తలు, అభిమానులతో నేరుగా ముచ్చటించేందుకు బ్లాక్, ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను తెలియజేసే ఫోరం, రిచా నటించిన కొత్త చిత్రాల రివ్యూలు, ఫ్యాన్ పేజ్, వీడియోలు ఉంటాయి. పరిశ్రమలో తనకు మంచి సపోర్ట్ ఇస్తున్న రానా, ప్రియా అనంద్, శేఖర్ కమ్ముల, తన తొలి చిత్రాన్ని నిర్మించిన ఎవిఎం నిర్మాతలు, ఆ చిత్ర సాంకేతిక సిబ్బంది, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రింట్-టీవీ మీడియో సిబ్బందికి తన కొత్త వెబ్ సైట్ లాంచింగ్ సందర్భంగా రిచా కృతజ్ఞతలు తెలియజేసింది.
Be first to comment on this News / Article!
|