పెద్దన్నగా రాజశేఖర్
ఏడుగురు తమ్ముళ్లకు అన్నగా హీరో డాక్టర్ రాజశేఖర్ తో ఓ కొత్త చిత్రం రూపొందనుంది. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమ సంస్థలో ఇది ప్రొడక్షన్ నెంబర్ 55గా రూపొందనుందని నట్టికుమార్ తెలిపారు.
'గోరింటాకు' తర్వాత రాజశేఖర్ మరో ఉదాత్తమైన పాత్రలో ఇందులో కనిపించనున్నారనీ, ఏడుగురు తమ్ముళ్ల అన్నగా ఆయన పాత్ర ఎంతో హుందాగా ఉంటుందనీ చెప్పారు. ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ వంటి అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయనీ, ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తారనీ తెలిపారు. ఏప్రిల్ 5న షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి భూపతిరాజా కథ, పరుచూరి బ్రదర్స్ మాటలు, ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|