సెన్సారైన 'ఆఖరి అన్వేషణ'
ప్రపంచ సుందరి జాంకీ షా హీరోయిన్ గా వినోద్ చాప్రా దర్శకత్వంలో హిందీలో రూపొందిన మిస్టర్ షక్ చిత్రాన్ని విఘ్నేష్ పిక్చర్స్ పతాకంపై 'ఆఖరి అన్వేషణ' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత టి.దుర్గారావు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాత దుర్గారావు మాట్లాడుతూ, రొమాంటిక్ మర్డర్ మిస్టరీగా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందిందనీ, అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయనీ చెప్పారు. కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలైన హీరోయిన్ ను చంపాలని కొందరు కుట్ర పన్నుతారనీ, ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయి, తనను చంపడానికి ప్రయత్నిస్తున్న దుష్టశక్తుల నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుని బయటపడిందనేదే ఈ చిత్రకథ అని అన్నారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్నారు. సెన్సార్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ధనుంజయ్ చౌహాన్, ఆర్తిపురి, ప్రేమ్ చోప్రా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పొందూరి మాటలు, పాటలు అందించారు.
Be first to comment on this News / Article!
|