బొత్సాతో చిన్న దర్శకుల భేటీ
చిన్న చిత్రాల సమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలో ముఖ్యసభులైన పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణను చిన్న చిత్రాల దర్శకులు హైద్రాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్న ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం 9 గంటలకు కలుసుకున్నారు. చిన్న చిత్రాలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను వారు సుమారు గంటసేపు మంత్రితో చర్చించారు.
చిన్న నిర్మాతల సమస్యలను పరిష్కరించే దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో దర్శకులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఏర్పాటు చేసే మీటింగ్ కు తప్పని సరిగా రమ్మని ఆహ్వానిస్తూ, సమస్యల సత్వర పరిష్కార మారాన్ని నిర్ణయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాలుగు వారాల టేక్స్ హాలిడే, 24 వారాలు రెంటల్ సిస్టమ్ లేకుండా షేర్ బేసిస్ మీద చిన్నచిత్రాల్ని ప్రదర్శించడం, తెలుగు టైటిల్ ఉన్న చిత్రాలకు సబ్సిడీ వంటి విషయాలపై దర్శకులతో ఆయన కూలంకషంగా చర్చించారు. పలు విషయాల పట్ల సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసి వారిలో దర్శకులు త్రిపురనేని చిట్టి, శివనాగేశ్వరరావు, వీరశంకర్, దేవీప్రసాద్, రాజా వన్నెంరెడ్డి, వెంకీ, బి.జయ ఉన్నారు.
Be first to comment on this News / Article!
|