పాలకొల్లులో అల్లు అర్జున్
స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారంనాడు సందడి సృష్టించారు. పాలకొల్లు అల్లు అర్జున్ స్వగ్రామం కావడంతో ఆయన సొంత జనాల మధ్య 'వరుడు' చిత్రాన్ని తిలకించారు. అల్లు అర్జున్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదల కావడం, అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీ ఎత్తున సందడి చేశారు. అల్లు అర్జున్ ను చూసేందుకు జనం విరగబడ్డారు. దిల్ రాజుతో కలిసి అల్లు అర్జున్ తన సినిమాను తిలకించారు.
స్వగ్రామంలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం చాలా థ్రిల్సింగ్ ఎక్స్ పీరియన్స్ అనీ, ప్రేక్షకాభిమానుల సందడిని తాను కూడా పూర్తిగా ఎంజాయ్ చేశాననీ అల్లు అర్జున్ పేర్కొన్నారు. అందరూ సినిమా చూసి వరుడ్ని ఆశీర్వదించాలని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
Be first to comment on this News / Article!
|