TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: My Thoughts
మాట పదిలమే అమ్మడూ!
- Site Administrator
  Page: 1 of 4   Next > >  
(విజయబక్ష్) మృదువుగా మాట్లాడటం ఎంత గొప్ప విషయమో! ఉన్నదంత మాటల్లోనే ఉంది. ఎదుటి వారిని నొప్పించకుండా విషయాన్ని చెప్పటం చాలా గొప్పతనం... కరచి, అరచి చెప్పడం కూడా ఉంటుంది. కొందరు మాట్లాడుతుంటే తీయగా, మెత్తగా, హాయిగా, హృదయానికి హత్తుకొనేలా ఉంటుంది. మరికొందరు మాట్లాడుతూంటే గయ్ గయ్ మని అరచినట్లుంటుంది. మనిషి గొప్పతనమంతా సగం మాటతీరులోనే ఉంటుంది. నిజమే... పరిశీలించి చూడండి. మనిషి భావవ్యక్తీకరణకి ముఖ్యమైన సాధనం మాటే కదా! సృష్టిలో మరెవరికీ, ఇతర జీవజాలానికి లేని ఈ మాడ్లాటే 'వరం' మనిషికొక్కడికే ఉంది. తన అభిప్రాయాలను, భావజాలాన్ని మనిషి భాష వల్లనే కదా ప్రసారం చేయగలుగుతున్నాడు. ప్రమేను, ద్వేషాన్ని, కోపాన్ని, తాపాన్ని అన్నింటినీ వెళ్ళగక్కటానికి మాటల మీదనే ఆధారపడుతున్నాడు. ఆఖరికి లిపిలో సాధ్యం కాని అభిప్రాయాలను సైతం మాటల్లో వ్యక్తం చేయవచ్చు! శబ్దజాలం ద్వారా వెలువరించవచ్చు. అంత గొప్పతనముంది మాటలకి! అయితే మనకున్న అద్భుతమైన శక్తిని వినియోగించుకోవటంలో విపరీతమైన ధోరణలకు పాల్పడుతున్నాం. తిట్టు కవిత్వాలున్నట్లు మనకు తెలుసు. ఆ ఆనవాయితీ పోకుండా మనం దాన్ని కాపాడుకొంటూ వస్తున్నాం. ఎదుటివారిని అనునయించేలాగ మాట్లాడవచ్చు. రెచ్చగొట్టేలాగానూ మాట్లాడవచ్చు.ఆయా మనుషుల స్వభావాన్ని బట్టి మాట్లాడే తీరు ఉంటుంది. ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. కొందరిలో అయితే పరిస్థితి ఎట్లాంటిదయినా తమని తాము 'కంట్రోలు' చేసుకొనే శక్తి కూడా ఉంటుంది.

Read 5 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 4   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training