TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: My Thoughts
మాట పదిలమే అమ్మడూ!
- Site Administrator
< < Previous   Page: 3 of 4   Next > >  
మనం ఎదుటి వ్యక్తిని గురించి ఓ అభిప్రాయానికి వచ్చేది ముందు ఆ వ్యక్తి 'మాటతీరు'ని బట్టే! ఒకసారి సంభాషణలోనే మనలో ఓ అంచనా మొదలవుతుంది. అంత చదువుకున్నా, అంత హోదాలో ఉన్నా, అంత డబ్బున్నా ఎంత చక్కగా మాట్లాడాడండీ! అస్సలు గర్వమే లేదు అని చెప్పుకొంటుంటాం... వాళ్ళ వాళ్ళ మాటతీరుని బట్టి పొగడడమో, తెగడడమో చేస్తుంటాం. నోరుజారి... తొందరపడి మాట్లాడే తీరు ఎన్నో అనర్థాలను తెచ్చిబెడుతుంది. సక్రమంగా వెళ్ళే విషయాన్ని పెడత్రోవకు మళ్ళిస్తుంది. ఎంత క్లిష్టమైన విషయాన్నయినా మంచి మాటల ద్వారా సరళంగా చేయవచ్చు. 'నరుకుతా - కొరుకుతా - నాలుక కోస్తా - తాట వలుస్తా - చంపుతా' వంటి మాటలు ఇంకా ఇంకా రెచ్చగొట్టేవిగా ఉంటాయి. ఫలితం అనూహ్యంగా ఉంటుంది. అందుకే పెద్దలు ఏదయినా మాట్లాడేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడమంటారు. ఇక మాటల ప్రభావం ఎట్లా ఉంటుంది అనే దానికి మన కుటుంబాలలో ముఖ్యమైన ఉదారహణ అత్తాకోడళ్ళే! పిలుపు నుండి మొదలెట్టి సంభాషణల్లోను అత్త అహంకారాన్ని అడుగడుగునా చూపించే అత్తలు చాలామంది ఉన్నారు. 'అమ్మా' అని ఆత్మీయతతో కూడుకొన్న పిలుపుకి 'అమ్మాయ్' అని గద్దించే పిలుపుకి ఎంతో తేడా ఉంది. ఆఖరికి 'సూటిపోటిమాటలు' అనే పదాన్ని వాక్యంలో ఉపయోగించమని విద్యార్థులకు ఇస్తే 'అత్తగారు గోడల్ని సూటిపోటి మాటలతో హింసిస్తుంది' అని రాశారు అంటే అత్తగారి 'మాటకారితనం' ఎంతకీర్తికెక్కిందో అర్థం అవుతుంది. మరికొందరుంటారు. ప్రొద్దస్తమానం తమగోడు తాము వినిపించటం తప్ప ఎదుటివారు వింటున్నారా లేదా అనేది కూడా పట్టించుకోరు. ఎంతకీ తమ గొప్పతాము చెప్పుకొంటూపోతారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ కొనసాగాలంటే ఏకపక్షంగా ఉండకూడదు కదా! ఎదుటివారికికూడా అవకాశం ఇవ్వాలి కదా! ఇంకొందరు 'మాటల గారడి' చేస్తుంటారు. 'అబ్బా మాటలతో పడేసావ్ కదా' అంటుంటాం... అలాంటివారిని. మెత్తమెత్తగా చెప్పవలసిన చోట కఠినంగా చెప్పేవారిని గూర్చి 'కట్టెవిరిచి పొయ్యిలో పెట్టినట్లు' మాట్లాడారు అంటాం. ముఖ్యంగా అధికారి స్థాయిలో ఉన్న వాళ్ళు తమ కింది వాళ్ళచేత పనిచేయించుకోవటంలో ప్రముఖ పాత్ర వహించేది మాటతీరే! విద్యార్థుల మనసుల్లో గూడుకట్టుకొన్న ఎందరో ఉపాధ్యాయులకి ఆ స్థానం దొరికింది వాళ్ళు చెప్పేపాఠాలతో పాటు వాళ్ళ ఆప్యాయత, వాత్సల్యంతో కూడుకొన్న మాటలతీరే! కొందరితో మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. గౌరవం కలుగుతుంది. మరికొంతసేపు మాట్లాడితే బాగుండు, విటుంటే హాయిగా ఉందే అనిపిస్తుంది. విషయం - భాషలతోపాటుగా మాట్లాడే పద్ధతి కూడా ఆ అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

Read 5 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 3 of 4   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training