'ఆ ఒక్కడు' రివ్యూ
స్టార్ హీరోలు అనిపించుకున్న పలువురు పూర్వాశ్రమంలో విలనీ పాత్రలతో మెప్పించిన వారే. నెగిటివ్ పాత్రల అజయ్ ను హీరోగా పరిచయం చేయాలనే ఆలోచన మన నిర్మాతలకు కాకుండా అమెరికాలో తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూటన్ రంగంలో మంచి పేరున్న టాలీ 2 హాలీ పిక్చర్స్ కు రావడం, అజయ్ ను ఎకాఎకిన 'ఆ ఒక్కడు'గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచే అంశమైంది. సహజంగా విలన్లు హీరోలుగా రూపాంతరం చెందినప్పుడు వీరి నుంచి పక్కా మాస్ ఫార్ములా చిత్రాలు జనం అశిస్తారు. అయితే ఈ చిత్ర కథకుడు, దర్శకుడు అయిన ఎన్.ఎస్.మూర్తి ఆలోచన మరోలా కనిపిస్తుంది. ఓ క్లైమ్ థ్రిల్లర్ కథాంశానికి సస్పెన్స్ జోడించి ఇక చూస్కోండి అన్నారు. నిజానికి థ్రిల్లర్ సినిమాలంటే వేగం ప్రధానం. కన్ను తెరిచి కన్ను మూసేంత స్పీడుగా నేరేషన్ జరిగిపోవాలి. దర్శకుడు ఈ విషయంలో మరింత కసరత్తు చేసుండాల్సింది. స్ట్రయిట్ నేరేషన్ కంటే ట్విస్ట్ ల మీదే ఆధారపడటం వల్ల ఎక్కడా కథ సాఫీగా నడిచినట్టు కనిపించదు. ముప్పాతిక వంతు వరకూ హీరో పాత్ర ఎలివేట్ కాకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తీరా ఆ పాత్ర ఎలివేట్ అయ్యే పరిస్థితి వచ్చేసరికి శుభం కార్డు పడిపోవడం వల్ల అజయ్ ను హీరోగా టర్న్ చేయాలనే ఉద్దేశం పాక్షికంగానే నెరవేరిన అభిప్రాయం కలగకమానదు. విలన్ గా ఉన్నప్పుడే ఒకటి రెండు ఫైట్లు ఉండే అజయ్ కు హీరోగా మారిన తర్వాత ఒక్క ఫైటూ లేకపోవడం మాస్ అభిరుచికి భిన్నమే. 'ఆ ఒక్కడు' నడక తీరు ఓసారి చూద్దాం.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|