ఎన్టీఆర్ మళ్లీ యాక్షన్ షురూ
వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న చిత్రం మళ్లీ పట్టాల మీదకు వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. కొడాలి నాని సమర్పకుడు. ఎన్టీఆర్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైన నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం పూర్తి స్వస్థత చేకూరడంతో ఎన్టీఆర్ బుధవారంనాడు మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఈరోజు నుంచి నాన్ స్టాప్ గా సినిమా పూర్తయ్యేంతవరకూ షెడ్యూల్ జరుగుతుందని తెలిపారు. 'ఆది', 'సాంబ' తర్వాత వినయ్ (వినాయక్) దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంలో తమ కాంబినేషన్ నుండి ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఉంటాయనీ, సాంకేతకపరంగా అత్యున్నత ప్రమాణాలతో అందరి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని వినయ్ తెరకెక్కిస్తున్నారని చెప్పారు. వినాయక్ మాట్లాడుతూ, తారకతో తాను చేస్తున్న మూడో సినిమా ఇదనీ, మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. తమ కాంబినేషన్ లో మరో సెన్సేషన్ ఫిలిమ్ అవుతుందని అన్నారు. ఏకథాటిగా జరిగే ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందని నిర్మాత వంశీ మోహన్ తెలిపారు. ఈ చిత్రం తప్పనిసరిగా ఎన్టీఆర్-వినయ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిలిమ్ అవుతుందన్నారు. అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కొడాలి నాని చెప్పారు. అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ-మాటలు, చంద్రబోస్ పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనందసాయి కళాదర్శకత్వం, స్టన్ శివ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|