గోవాలో 'రామ్ దేవ్
యాక్షన్ తో పాటు వినోదం, ఫ్యామిలీ డ్రామా వంటి అంశాలతో రూపొందుతున్న చిత్రం 'రామ్ దేవ్'. ఎస్.బి.కె.ఫిలింస్ పతాకంపై ఎస్.కె.బషీర్ ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. గ్రేసీసింగ్, అర్చన, అబ్బాస్, ఆకాష్, సాయికిరణ్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం టాకీ, నాలుగు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్ ఉన్న మూడు పాటల్లో రెండు పాటల చిత్రీకరణకు గోవా వెళ్తున్నట్టు బషీర్ తెలిపారు.
ఈనెల 9 నుంచి వారం రోజుల పాటు బ్యాలెన్స్ పాటలు రెండూ చిత్రీకరిస్తామనీ, హైద్రాబాద్ లో మరో పాటను భారీ సెట్ లో చిత్రీకరించనున్నట్టు తెలిపారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావచ్చాయని చెప్పారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న పక్కా కమర్షియల్ చిత్రమిదనీ, ఆర్టిస్టులంతా పాటీపడి నటించారనీ చెప్పారు. త్వరలోనే ఆడియో విడుదల చేసి ఆగస్టు మొదటివారంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పరుచూరి గోపాలకృష్ణ, ఆలీ, సూర్య, కవిత, హేమ, సంగీత, గీతాసింగ్, ముంజుభార్గవి, చిత్రం శీను, సత్తెన్న, దాసన్న తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సహితం బషీద్ సమకూరుస్తుండగా, విజయశ్రీ సినిమాటోగ్రఫీ, నందు ఫైట్స్, శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|