'సంతోషం'గా చిరంజీవి బర్త్ డే
మెగాస్టార్ చిరంజీవి తన 54వ బర్త్ డేను 'సంతోషం ఫిల్మ్ అవార్డ్స్-2008' అవార్డుల వేదికపై సంబరంగా జరుపుకొన్నాను. చిరంజీవి శనివారంనాడు మరో వసంతలోకి అడుగుపెడుతున్నారు. ఇందుకు కొద్ది గంటల మీదే ఆయన శుక్రవారం రాత్రి హైద్రాబాద్ ఇంటర్నేషన్ల్ కల్చరల్ సెంటర్ లో జరిగిన 'సంతోషం' అవార్డుల వేడుకలో పాల్గొని అభిమానులను, పరిశ్రమ ప్రముఖులను సంబరంలో ముంచెత్తారు. 'సంతోషం' అవార్డ్స్ గత వేడుకల్లో పలుమార్లు ఉత్తమనటుడుగా అవార్డును అందుకున్న చిరంజీవి సభాప్రాంగణంలోకి రావడంతో నిర్వాహకులు భారీ కేక్ తెప్పించారు. వేదికపై చిరంజీవి కేక్ కట్ చేసి 'మగధీర' రామ్ చరణ్ కూ, అల్లు అరవింద్ కు తినిపించారు. వారు సైతం చిరంజీవితో కేక్ తినిపించి తమ సంబరాన్ని పంచుకున్నారు. పూరీ జగన్నాథ్, వి.వి.వినాయక్ తదితరులంతా వేదికపై ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కష్టాన్ని నమ్ముకునే వాళ్లంటే తనకెంతో ఇష్టమనీ, సురేష్ తనకు ఎప్పట్నించో తెలుసుననీ, నంది అవార్డులకు తక్కువ కాకుండా ఏడేళ్లుగా ఆయన ఫిలిం అవార్డులు ఇస్తూ కళా సేవ చేస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు. ఈ అవార్డులు ఏటా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు. సేవారంగంలోకి తాను వెళ్లినప్పటికీ తనకు అభిమానులు ఇచ్చిన మెగాస్టార్ పేరు అంతగా తన హృదయాన్ని హత్తుకుపోయిందనీ, తన పేరు ముందు అతుక్కుపోయిందనీ అన్నారు. వారికి తన ఆజన్మాంతం రుణపడి ఉంటానన్నారు. తనకు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలనీ, ఈ రోజు మీ అందరి ఆశీస్సులు చరణ్ కు, పవన్ కు, అల్లు అర్జున్ కూ ఉచ్చారని, ఈ అభిమానం కలకాలం ఉండాలని కోరుకుంటున్నాననీ అన్నారు.
Be first to comment on this News / Article!
|