|
|
Articles: My Thoughts | aarthi - Mr. Syam Satyanarayana Konduri
| |
1. పంచదార తినగా తియ్యగా ఉంటుంది ఉప్పు తింటే నోరు ఉప్పనౌతుంది
నవరుచులు అన్ని నాణ్యంగా ఉంటాయీ నిజం ఒక్కటే కడు చేదుగా ఉంటుంది
2. నిక్కమైన మంచి నీలమక్కరలేదు తళుకు బెళుకులు మాకు సరసంగ ఉంటాయి
చదువు సంధ్యలు వద్దు సాహిత్యమే వద్దు నిష్ఠురము వద్దు నిజం చెబుతున్నాను
3. కట్నమక్కారలేదు కానుకలు కావాలి లగ్గమేట్లాగున్న లాంఛనల్ తేవాలి
ఫిక్సీడ్లూ కావాలి రికుర్రింగ్ కావాలి పిల్ల బాగుందాలి ఒదిగొదిగి ఉండాలి
4. తల్లితండ్రులే ఇల ఘనము ఘనమంటారు అడ్దాలనాదే బిడ్దలంటారు
అన్నదమ్ములె వీరు రామలక్ష్మణులు ఆస్తి కోసం వీరు అసురులౌతుంటారు
5. దేశమంటే దొద్డ అభిమానమంటారు దేశ ప్రజ కోసమే మా ఊపిరంటారు
నేతగా వస్తారు నేర్పుగా దోస్తారు నేరగాళ్ళకే వారు కొమ్ము కాస్టారు...
6. నిజం నిజమంటారు నిర్భయం అంటారు నిజం చెప్పిన పిదప నేరమంటారు
నీతిగ బ్రతికితే మేత కరవౌ తుంది నేతగా బ్రతకర నీతి లేకుండా
7. గుడులు గోపురాలు భక్తి కైవారాలు భయము గల వారికి ముక్తి సోపానాలు
చేస్తారు పెళ్ళిళ్ళు దేవ దేవేరులకు హుండిలో వేస్తారు ముడుపులు కట్నాలు
8. మానవసేవాయే మాధవసేవని చెబుతారు ఎన్నెన్నో శ్రీరంగనీతులు
చేస్తారు పొంగల్లు మేస్టారు ఎంచక్కా తిండిలేని జనులు దృష్టికే రారింకా
9. దేశభాషలందు తెలుగు లెస్సన్నారు తరిచి చూడగా నేడు తెలుగు లెస్సయ్యింది
ఆంగ్ల భాష మోజు అధికమయి పోతోంది కాన్వెంటులో జెర్పా సీటు కరవౌతోంది
10. బ్రతకలేక నాడు బదిపంతులయ్యారు బ్రతుకు నేర్చే నేడు బడి పంతులయ్యారు
గురుకులాలు నేడు రెసిడెన్షియల్స్ అయి కొల్లగొదుతున్నాయి తల్లి తండ్రులను
11. మనుషులందరు కూడా మనసు పెడతారని ఆశ పడుతున్నాను ఆర్తినౌతున్నాను
దోపిడీ వ్యవస్థ మార్చి వేసేందుకై చేయూతనివ్వండి చేతనయినంత
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|