|
|
Articles: My Thoughts | ఎన్నికల వేళ కాలుష్యం - Dr. Srinivasa Rao Duggaraju
| |
ఎన్నికలు వస్తున్నాయి.
ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరి ఉత్సాహం వారిది. తిరిగి అధికారం అందుకోవచ్చనే ఆశ ప్రతిపక్షానిది. అధికారం చేజారిపోకుండా కాపాడుకునేందుకు తామేమీ చేయాలా అన్న హడావుడి అధికార పక్షం వారిది. పొత్తుల హడావుడి ఒకరిది. కొత్త పార్టీలు పెట్టిన వారిది మరో తరహా హడావుడి. వెరసి అదంతా ప్రచార హడావుడి.
ఈ ఎన్నికల హడావుడంతా పార్టీలు చేసేదే అయినా దాని ఫలితాలు అనుభవించాల్సింది సామాన్య ప్రజలు. ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాభిప్రాయం ప్రతిబింపచేసేవి అంటారు. కాని నిజానికి అవి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి వచ్చే పర్యావరణ విధ్వంసక తంతుగా పరిగణించాలి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకేసారి ఒక్క రోజున మాత్రమే జరుగుతాయి. కాని మనకు అలా కాదు. పంచాయితీ నుండి పార్లమెంటు ఎన్నికల వరకు ప్రతి ఆరు నెలలకు ఒక ఎన్నిక వస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల తంతు నడుస్తూనే వుంటుంది. ఫలితంగా దేశంలో ఎప్పుడూ ఏదో ఒకచోట ఈ ఎన్నికల ప్రభావం పడుతూనే వుంటుంది.
ఎన్నికలు పర్యావరణం మీద ప్రభావం చూపుతాయన్న విషయాన్ని చాలామంది గమనించారు. ఎన్నికల ముందు భారీ సభలను ఒక పార్టీ మించి మరొక పార్టీ నిర్వహిస్తూంటుంది. పోటాపోటీగా నిర్వహించే ఈ సభలకు జనాభా సమీకరణ, జనాభాకి తగిన ఏర్పాట్లు, సభకోసం చేసే ప్రచారం, తిప్పే వాహనాలు, వాడే మైకులు... యిలా ప్రతి అంశంలోనూ పర్యావరణ విధ్వంసం మిళతమైంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|