|
|
Articles: Short Stories | బాలయోధులు - Editor
| |
(కేఆర్టీ)
పక్కింటి కోదండం ఇల్లంతా సందడిగా ఉంది. ఏమిటా అని వెళ్లి చూద్దును కదా, వాడి అయిదేళ్ల మనవడికి అందరూ హారతలు పట్టి, భజనలు చేస్తున్నారు. వాడు పెట్టుడు మీసాలతో ఠీవిగా కూర్చున్నాడు.
ఏమిట్రా ఇదంతా? మీ మనవడి పుట్టిన రోజు పండుగా? అని అడిగాను అమాయకంగా.
ఓరి అమాయకుడా! ఇవాళ మానాన్న గారు చిరంజీవిరావుగారి పుట్టినరోజు! అన్నాడు ఉత్సాహంగా.
మరి మీ మనవడికి హారతిలిస్తున్నారేంటి?
వాడు మా మనవడు కాదు. సాక్షాత్తూ మా నాన్నే మళ్లీ పుట్టాడు. అందుకనే వాడికి మా నాన్నగారి పేరే పెట్టాం.
మరి ఇంతకుముందు ఇలాంటి వేడుకలు చేయలేదు కదా?
అలా అడిగావు బావుంది! మా చిరంజీవికి మా నాన్నగారి స్వాతంత్ర్య సమరయోధుని పింఛను మంజూరయింది... అన్నాడు ఆనందంతో పొంగిపోతూ కోదండం.
నేను అవాక్కయ్యాను. మెల్లగా తేరుకుని, అయిదేళ్ల వాడికి స్వాతంత్ర్యసమరయోధుని పింఛనా? అనడిగాను.
అవునోయ్! మన మిత్రుడు చక్రపాణి గారనే పైరవీ మాస్టారు ఈ సహాయం చేసిపెట్టాడు. చక్రం తిప్పడంలో ఆయన దిట్ట.
ఇదెలా సంభవం? ఇచ్చేవాళ్లు వాస్తవాలు పరిశీలించరా? అన్నాను ఇంకా నమ్మకం కుదరక.
ధనమేరా అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం! - ఆ పాటలో అర్థం గ్రహించుకో... అన్నీ నీకే తెలుస్తాయి. అన్నట్టు మీ మనవడు బాబిగాడి క్కూడా పెన్షన్ ప్రయత్నించమంటావా? జస్ట్ యైభైవేలు పెట్టుబడి పెడితే చాలు. జీవితాంతం పెన్షన్!
వద్దురా బాబూ! నేనెలాంటి పనులు చేయలేను.
అందుకే గొఱ్ఱెతోకలా ఉండిపోయావ్... అద్సరేగానీ... రేపు తిరుపతి వెళ్తున్నాము, నీవు కూడా వస్తావా?
ఏమిటింత అర్జంట్ ప్రోగ్రామ్ పెట్టావ్?
ఇప్పుడు మావాడు, నేనూ ఉచితంగా ఫస్ట్ క్లాస్ లో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు...
అదెలా?
స్వాతంత్ర్య సమరయోధులకి ఫస్ట్ క్లాస్ ప్రయాణం ఉచితం. వాళ్లతో బాటు ఒక సహాయకున్ని వెంటబెట్టుకెళ్లవచ్చు. మా వాడికి పింఛన్ మంజూరయిన శుభసందర్భంగా తిరుపతిలో తలనీలాలు ఇచ్చిరావడానికి వెళ్తున్నాం.
ఎవరెవరు?
ఇంకెరూ? నేను...సారీ సారీ... నా మనవుడు, నేనూ
సంతోషం! నేను కూడా వస్తాలే పద. నేను రిటైరైన రేల్వే ఉద్యోగిని కదా! నాకెలగూ ఫస్ట్ క్లాస్ పాసుంది అన్నాడు.
0-0-0
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|