|
|
Articles: My Thoughts | చానెళ్ళ చాకిరేవు - Editor
| |
(కొడుకుల శ్రీనివాస్)
ఇరవై ఐదేళ్ళ క్రితం టీవీ అనేది విలాసవంతమైనది. ఆ రోజుల్లో ఎంచక్కా మన తెలుగులో కూడా ఒక చానెల్ ఉంటే ఎంత బాగుంటుందో అని జనం అనుకొనేవారు. కానీ ఇప్పుడు బాబోయ్ ఇన్ని తెలుగు చానెళ్ళా భరించలేకపోతున్నాం అని తలలు పట్టుకొంటున్నారు. ఒక్క తెలుగులో అవీ ఇవీ అన్నీ కలిపి ఇప్పటికే మూడు పదుల చానెళ్ళు వచ్చేశాయి. మరో ఇరవై చానెళ్ళు తెలుగువాడి సహనాన్ని పరీక్షించేందుకు రానున్నాయని సమాచారం. వీటన్నింటిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నది మాత్రం డిడి8 (సప్తగిరి) చానెల్ ఒక్కటి మాత్రమే. మిగిలినవన్నీ ప్రైవేట్ చానెళ్ళే.
టీవీ చానెళ్ళను జనరల్, సినిమా, సంగీతం, న్యూస్, చిల్డ్రన్, భక్తి, మహిళ విభాగాలుగా విడదీశారు. జనరల్ చానెళ్ళుగా ఈ టీవీ, మా టీవి, జెమిని, విస్సా సీరియళ్ళను పెంచి పోషిస్తున్నాయి. జెటెక్స్, కార్టూన్ నెట్ వర్క్, డిస్నీ చానెళ్ళు పిల్లలను ఒక్క నిమిషం కూడా పుస్తకాలు పట్టుకోనివ్వకుండా టీవీలకు కట్టిపడేస్తున్నాయి. ఇక భక్తి విషయానికి వస్తే సంస్కృతి, భక్తి, వెంకటేశ్వర భక్తి, శుభవార్త, రక్షణ అనే చానెళ్ళు నిరంతరం నీతిబోధలు చేస్తూనే ఉన్నాయి. తేజ టీవీలో ఎర్లీ మార్నింగ్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకెండ్ షో, మిడ్ నైట్ షో ఇలా ఇరవై నాలుగ్గంటలూ ప్రసారం చేసిన సినిమాలనే మళ్ళీ ప్రసారం చేస్తూ ఊదరగొడుతున్నాయి. మహిళలకు సంబంధించి ఇప్పటికే ఒక వనిత చానెల్ ప్రారంభమైంది. త్వరలో ప్రియదర్శిని, నాయిక చానెళ్ళు కూడా వస్తాయట. ఇవి కాక వెబ్ చానెళ్ళు రిఫ్లెక్ట్ టీవీ, కోఫీ టీవి, యూసీటీవీలు ఈ సరికే నెట్ ప్రసారాలు ప్రారంభించేశాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|