|
|
Articles: My Thoughts | 'కాపీ'కి 'రైటు' లేదు! - Editor
| |
(ఎ.రామలింగేశ్వరరావు)
మనం పుస్తకాలు చదివేటప్పుడు సాధారణంగా పుస్తకం రెండవ పేజీలో 'సర్వహక్కులు రచయితవి' అనో మరొకటో వుంటుంది. దానికి అర్థం కాపీరైటు అని. దాని కథాకమామిషు తెలుసుకుందాం.
కాపీరైటు అనేది మేధోసంపత్తికి సంబంధించిన హక్కు. అటువంటి హక్కు రచనకి కాని, తయారుచేసిన కళారూపానికి చెందుతుంది కాని ఆలోచనకు కాదు. మన మెదడులో ఎన్నో ఆలోచనలు వుండవచ్చు. అవి ఒక రూపం పొందినప్పుడే మనకి హక్కు వస్తుంది. ఇంతే కాకుండా ఆ రూపానికి, ఆ రూపం తీసుకువచ్చిన విధానానికి వున్న తేడాను కూడా మనం గుర్తించాలి. వాస్తవాల్ని కాని, కథావస్తువును కాని, ఒక కళని కాని వ్యక్తీకరించే పద్ధతిని ఆ హక్కు కాపాడుతుంది. అందుకనే ఒక పుస్తకాన్ని కొని దాన్ని కాపీ చేసి అమ్ముకొనే హక్కు మనకుండదు. పుస్తకాన్ని కాని, ఏదైనా వస్తువును కాని కొన్నంత మాత్రాన దానిపై సర్వహక్కులు మనకు చెందవు.
మనకు బ్రిటీషు న్యాయవిధానం నుండి కాపీరైటు వారసత్వం వచ్చింది. ఇంగ్లండులో మొదటిసారిగా 17వ శతాబ్దంలో కాపీరైటు చట్టం వచ్చింది. మనదేశంలో 1914లో మొదటి కాపీరైటు చట్టం వచ్చింది. ప్రస్తుతం 1957లో చేసిన చట్టం అమలులో వుంది. ఈ చట్టం స్వంత రచనలపై రచయిత హక్కును రక్షిస్తుంది. ఒక రచయిత వేరొకరి భావాలను, ఆలోచనల్ని గ్రహించి ఒక క్రొత్త రచన చేసినా దానికీ హక్కు వుంటుంది. అలా అని సంకలనాలకు వర్తించదు. వాటిల్లో కూడా ఎంతో కొంత సృజనాత్మకత, మేధోపరమైన కృషి వుంటే అది మాతృకగా గుర్తించడానికి వీలుంటుంది. అటువంటి సంకలనాలలో కూడా వివిధ వ్యక్తులకు సంబంధించిన వ్యాసాలకు కాపీరైటు వుంటే అవి వారికే చెందుతాయి. ఉదాహరణకి న్యాయస్థానాల తీర్పుల్ని తీసుకొని వాటిని సులభంగా చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి వీలుగా ముందు శీర్షిక, ప్రధానాంశాలు తయారుచేసి ముద్రించినట్టయితే అటువంటి ప్రచురణకి ఈ హక్కు కలుగుతుంది. 12-12-2007న సుప్రీంకోర్టు 'ఈస్టరన్ బుక్ కంపెనీ' కేసులో గత తీర్పుల్ని పరిగణనలోకి తీసుకొని ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది.
చట్టం ప్రకారం ఈ క్రింది వాటికి కాపీరైటు హక్కులు వర్తిస్తాయి.
సాహిత్య, డ్రామా, సంగీత మరియు చిత్రరూపాల మాతృకలకు
చలనచిత్రాలు మరియు
ధ్వని రికార్డింగులు
కంప్యూటర్ కు సంబంధించిన ప్రోగ్రామ్ లు, టేబుళ్లు, డాటాబేస్ లు సాహిత్య రూపాల్లోకి వస్తాయి. చిత్ర రూపాల్లోకి మనం నిత్యం వాడుకొనే వస్తువులు వస్తాయి. కాని ఏభైకి పైన వస్తువులు ఏదైనా పారిశ్రామికంగా ఉత్పత్తి చేసినట్టయితే అటువంటి రూపాల్ని డిజైన్ల చట్టం క్రింద నమోదు చేసుకొని రక్షించుకోవాల్సి వుంటుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|