|
|
Articles: My Thoughts | తెలంగాణ పల్లెలు - Editor
| |
(బుచ్చిరెడ్డి)
ఆమె వద్దన్నా
వీడు కాదన్నా
సరికొత్త పొత్తులతో
రాష్ట్ర రాజకీయం
మలుపు తిరుగుతుంది
దేశం -- అన్ని పార్టీలలో
తెలంగాణా సంచలనం
ఇక - ఆగదు
సొంత దేశంలో
సొంతవానిగా బ్రతికే రోజు
వచ్చి తీరుతుంది.
తెలంగాణా వచ్చి తీరుతుంది
ఆ రోజు
పంద్రా ఆగస్ట్ లా
మరొక్కసారి
స్వాతంత్ర్యం తెచ్చుకున్న రోజు
దసరా -- దీపావళి
క్రిస్మస్ -- రంజాన్
అన్నీ ఆరోజే
గుళ్ళో గంటలు
హరే రామ
ఎస్ ప్రభు
అల్లాహ్ కె నామ్
అందరూ పాడుకుంటూ
తప్పట్లతో -- తాళాలతో
తంబూరాలతో
చిందులు --- విందులు
దేవుళ్ళు వేరు అయినా
ఆందరి దేవత
** జై తెలంగాణా తల్లి **
నాగలి నా ఆయుధం అంటూ
రైతువీరులు -- నెల కోసం
చాలు కోసం పయనం
కోడి కూతలు -- గజ్జెల చప్పుళ్లు
ఊరపిచ్చుకల కిచకిచలు
చలి నెగళ్లు
చిర్రా గోనలు
బావుల్లో ఈతలు
ఊరంతా తానమాడే చెరువులు
కోతి కొమ్మచ్చి ఆటలు
పల్లెల్లో పచ్చదనం
అన్నింటా కనిపించే రోజు
ప్రతి ఇంటి ముందూ గులాబీ జెండా
ప్రతి ఊళ్ళో తెలంగాణా తల్లి విగ్రహం
అటు గాంధీజీ -- ఇటు తెలంగాణా తల్లి
ఇద్దరు దేవుళ్ళ మధ్య ఆటలు పాటలు
ఆగమైన పల్లెలు
అగ్గి గొగ్గిళ్ళు అయిన పల్లెలు
తల్లడిల్లిన పల్లెలు
ఈ రోజు సూడసక్కనిపల్లెలు
ప్రేమలకు
మమతలకు
అనురాగాలకు
కేరాఫ్ తెలంగాణా పల్లెలు
గాదెలు నిండిన లోగిళ్ళు
ధాన్యం పంచే చేతులు
నిండు మనసుతో మురిసిపోతున్న పల్లెలు
వీరులను కన్న పల్లెలు
నాటి నుంచి నే టి దాకా
పిడికలెత్తి పోరాడి
విముక్తొ పొందిన తెలంగాణా
ఇక
అన్ని దేశాల తెలంగాణా మిత్రులంతా
గ్రామాలను దత్తత చేసుకోక మానరు
విత్తనాల సరఫరా
బోరింగులు సాగునీరు తాగునీరు
మురుగుదొడ్ల నిర్మాణం
బేడా వడ్డీలు
వయోజన విద్య
వైద్య సదుపాయం
నెల బంగారం కావడం కాయం
అందరూ చేతులు కలపడం ఖాయం
పల్లెల రూపం మార్చక మానరు
సకాలంలో సొంత
ప్రభుత్వం
స్పందిచక మానదు
ఆ రోజు
కూలిన గోడలు కనిపించవు
ఇండ్ల ముందు చానుపులు ముగ్గులు
ఆకుల తోరణాలు
చెంగు చెంగున గంతులేస్తున్న దూడలు
నాకుతున్న గొడ్లు
నాకు నీవు
నీకు నేను మాటలు
సాయత్రం ఊరు కచేరి ముందు
గోరటి వెంకన్న గద్దరన్న పాటలు
డాన్స్ లు దేశభక్తి గీతాలు
కోలాట పాటలు
చిందు బాగోతాలు
కబడ్డీ ఆటలు
అంతా హల్ చల్
పల్లెలు మారిపోవడం ఖాయం
బ్రతుకుల్లో తీయదనం
కొత్తదనం
ఒక మలుపు
ఒక మెరుపు
ఒక్కో పూవేసి చందమామ
మా పాలన మాకొచ్చే చందమామ
బతుకమ్మలు ఆడి తీరుతాయి
బోనాలు లేవక మానవు
జమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకోవడాలు
కౌగిలింతలు ప్రేమలు
పాలపిట్ట కనిపించి తీరుతుంది
ఊరి థియేటర్ లౌడ్ స్పీకర్లో
ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే,
రోజులు మారాయి మారాయి పాటలు
కొత్తదారులు వెతుకున్న పల్లెలు
రతనాల పల్లెలు
తెలంగాణా రేపటి పల్లెలు
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|