|
|
Articles: My Thoughts | 'పోర్టు' దగ్గరుండొద్దు - Dr. Srinivasa Rao Duggaraju
| |
'ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అతి సమీపంలో' అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు చేసి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ అనేది భారీ వ్యాపారం. భూమి మీద పెట్టుబడి క్షేమం, లాభం అనే నమ్మకం. అందుకే అటువంటి వ్యాపార ప్రకటనలను చూసి మధ్యతరగతి ఎగురుకుంటూ వెళ్ళి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి సమీపంలో వుండాల్సిన అవసరం ఏమైనా వుందా? విమానం ఎక్కి ప్రయాణం చేసే వారెంతమంది? అందునా ఇంటర్నేషనల్ ప్రయాణాలు చేసే వారెందరు? విమానాశ్రమం దగ్గర వుండాల్సిన అవసరం వుందా?
మనలో అందరం రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం చేసే వుంటాం. కానీ ఏనాడూ మన ప్రయాణం కోసం రైలు స్టేషన్ పక్కనే ఇల్లుంటే బాగుండేదని, బస్ స్టాండ్ దగ్గరగా ఇల్లు ఉండాలని అనిపించదు. అటువంటిది విమానాశ్రయానికి సమీపంలో వుండాలని ఎవరు కోరుకుంటారు? ఎవరూ కోరుకోనిదైనా అంతర్జాతీయ విమానాశ్రయం అనే ఒక్క మాటతో కోట్లాది లాభాలను దంచుకుంటున్నారు. విమానాశ్రయానికి సమీపంలో వుండటం ఒక సామాజిక హోదాగా భావించేవారు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగ్గర్లో స్థలం కొన్నామని గర్వంగా చెప్పుకునేవారు కోకొల్లలుగా వున్నారు.
అయితే అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఇల్లు కట్టుకొని వెళ్ళినవారికి తర్వాత గాని తెలియదు... కోట్లు కుమ్మరించి నరకంలోకి దిగామని. విమానాశ్రయాలను జనావాసాలకు దూరంగా నిర్మిస్తారు. విమానాశ్రయపు రగణగొణ ధ్వనులేవీ జనం మీద పడకూడదనే సదుద్దేశంతో విమానాశ్రయాలు కడుతుంటే, ఆ విమానాశ్రయాలను వెంటాడుతూ వెళ్ళటం మనం చేస్తున్న ఒక పెద్ద తప్పిదం.
విమానాశ్రయాలంటే ధ్వని కాలుష్య ప్రదేశాలు. ఒక్కొక్క విమానం కిందిగి దిగుతున్నా, గాలిలోకి లేస్తున్నా అవి సృష్టించే ధ్వనికి సమీప ప్రదేశాలన్నీ దద్దరిల్లిపోతాయి. ధ్వనిని డెసిబుల్స్ లో కొలుస్తారు. మానవుల చెవులు 60 నుండి 90 డెసిబుల్స్ వరకు ధ్వనిని భరించగలవు. ఆ స్థాయిని దాటిన ధ్వని మానవుల చెవులకు చెరుపు చేస్తుంది.
90 డెసిబుల్సుకు మించిన ధ్వనికి రోజుకు ఆరుగంటలు గురైన మానవుల చెవులలోని నాడీ కణాలు దెబ్బతింటాయి. ఈ నాడీ కణాలు చెవులకు చేరిన ధ్వనులను మెదడుకు చేరవేస్తాయి. ఎప్పుడైతే ధ్వని కాలుష్యం ఆ నాడీ కణాలను, నాడులను దెబ్బతీస్తాయో అప్పుడు చెవుడు వస్తుంది. ఈ ధ్వని కాలుష్యానికి దెబ్బతినేది పిల్లలు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|