|
|
Articles: Politics | ఆలోచించి ఓటేయి - Mr. rythubidda Madhyatharagathi
| |
మళ్ళీ ఎలక్షన్స్ వొచ్చాయి.
కొత్త పార్టీలైతేనేమి... పాత పార్టీలైతేనేమి... వాళ్ళ అభ్యర్థులు, వాళ్ళ పార్టీల తీరు ఏమీ మారలేదు.
అందరికీ బలమైన అభ్యర్థి కావాలి.... ఎవరైతే గత ఐదు పదేళ్ళుగా... పదవులనుభవించి... లంచాలు బొక్కి... లేదా కుటుంబ నేపధ్యం అనే సాకుతో ఎదగకుండా చేసి.... రాజకీయమే మా ఉపాధి అనుకుంటూ వుండే నాయకులే బలమైన అభ్యర్థులు.
గత ముప్పైఏళ్ళ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో... ముందు నాలుగు కుటుంబాలు... మరీ ఒక వర్గ గుప్త్తాధిపత్యం నడుస్తోంది.
గెలిచే గుర్రాలు అనేవి కేవలం ఈ కుటుంబాలు... లేదా వారి సామాజిక వర్గానికే చెందిన రియలెస్టేట్ వ్యాపారులు.... వీరే అభ్యర్థులు....
అసలు మధ్యతరగతి... పేద... బలహీన వర్గాలు వారు ఎలక్షన్లో పోటీకి అర్హులు కారా... ఏదో రిజర్వేషన్ సాకుతో నామ్ కే వాస్తే
ఆ సామాజిక వర్గ అభ్యర్థులు గెలిచినా... జిల్లా పెత్తనం ఈ బడా బాబులదే!
ఏమిటీ ఈ దౌర్భాగ్యం... ఈ కుటుంబాల్లోని కొందరైతే... సరిగ్గా పేపర్ కూడా చదవలేరు
సామాన్యుడు...... అబ్బో పెద్దింటి కోడలు ప్రచారానికొచ్చింది... సినిమా నటుడొచ్చాడు... పెద్దాయన వొచ్చాడు అని ఎలవరపోయి చూసినంత కాలం ఇదే దౌర్భాగ్యం
ఒక అభ్యర్థి అయినా సమస్యల్ని ఎలా పరిక్షరిస్తారో చెప్పరా... కనీసం మనమైన... మనం ఓటేసే అభ్యర్థికి మన సమస్యల మీద అవగాహనుందా అని ఆలోచించామా?
ఆలోచించనంత కాలం ఇంతే పరిస్థితి.... ఈ పేద కుటుంబాల వారు.... మీబోటి నాబోటి మధ్యతరగతి వాళ్ళే కుర్చీకి కాళ్ళుగానే ఉపయోగించుకుంటారు.
బహుపరాక్.... నెల్లూరీయుడా! ఇది నీకు సరైన సమయం... చరిత్రను తిరగేసే అవకాశం ఇప్పుడే ఉంది.
అసలు ఈ నాయకులు... ఆనం, నేదురుమల్లి, సోమిరెడ్డి, నల్లపురెడ్డి, పనబాక... మనకు అవసరమా ? అబ్బాయా?
ఆలోచించి ఓటేయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|