|
|
Articles: My Thoughts | పచ్చని జీవనశైలి - Site Administrator
| |
(జయప్రకాష్ నంబారు)
మన చుట్టూ ఉన్న సమాజం కోసం
మనం నివసిస్తున్న ఈ భూమికోసం
ఒక్కన నిమిషం కేటాయించమని
ప్రేమాలయం వినమ్రంగా కోరుతోంది,
రండి! పచ్చని జీవనశైలిని అలవర్చుకుందాం!
ఉత్తర ధృవం కరిగి ద్వీపంగా మారిపోతోంది
మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి
ప్రకృతి వైపరిత్యాలు, కరువు కాటకాలు ప్రబలిపోతున్నాయి
అవసరానికి మించిన వినియోగం, వృథా అవుతున్న విద్యుత్తు, నీరు
రాబోయే తరాల కనీస అవసరాలకు ప్రశ్నార్థకంగా అవుతున్నాయి
చెట్లు నరకడం, ప్లాస్టిక్ వాడకం, వన్యప్రాణుల ఉనికిని అంతరింపజేస్తున్నాయి
భూమిలోనూ, నీటిలోనూ వందేళ్ళైనా కరిగిపోని ప్లాస్టిక్ కవర్లు క్యాన్సర్లకూ,
పొంగి పొర్లే మురికినీటికీ, నిలువ నీళ్ళతో రోగాలకూ కారణవుతున్నాయి
తగ్గిపోతోంది నేలలోసారం... పెరిగిపోతోంది భూమిలోవేడి
రోజు రోజుకీ తుఫాను, భూకంపాల తీవ్రత పెరిగిపోతోంది
ఈ ఆపదల నుండి మనల్ని, మన భావితరాలను
కాపాడుకునే అవకాశం ఇప్పటికీ మనకుంది
రండి! పచ్చని జీవనశైలిని అలవర్చుకుందాం!
మొక్కలు పెంచుదాం! ప్లాస్టిక్ వదిలేద్దాం!
వృథా తగ్గిద్దాం! మాన వనరులు మిగిలిద్దాం!
స్వచ్ఛమైన గాలి, నీటిని మన భావితరాలకందింద్దాం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం అంటూ
గర్వంగా పాడుకునే భాగ్యం మన భావితరాలకు కలిగిద్దాం
రండి! పచ్చని జీవనశైలిని అలవర్చుకుందాం!
పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి హైదరాబాద్ కు చెందిన ప్రేమాలయం సంస్థ కృషి చేస్తోంది. ఈ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రేమాలయంతో చేయి కలపండి.
ఇతర వివరాలకు
www.premalayam.in ను గాని premalayam@gmail.com గాని సంప్రదించండి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|