|
|
Articles: Recipes | ఫిష్ కట్ లెట్స్ - Site Administrator
| |
కావలసినవి
ఫిష్ : అరకిలో
పచ్చిమిర్చి : 10
పెద్ద ఉల్లిపాయలు : 2
ఎగ్స్ : 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
గరం మసాల : చిన్న స్పూన్
ఉప్పు : తగినంత
పసుపు చిటికెడు
కార్న్ ఫ్లోర్ : 1 స్పూన్
కొత్తిమీర : ఒకకట్ట
నూని పేయించడానికి సరిపడ
తయారుచేయు విధానం
ముందుగా ఫిష్ ను శుబ్రంచేసుకుని ముక్కలు చేసి ఆవిరి మీద ఉడికించాలి. ముక్కలు చల్లారేలోపల ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. దీనిలో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కార్న్ ఫ్లోర్, మసాలాలు వేసి పక్కన పెట్టాలి. చల్లారిన ముక్కలను చిదిపి ముల్లులు తీసివేసి ఉల్లిమిశ్రమంలో వేసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఎగ్ ని ఒక గిన్నెలో కార్చి బాగా బీట్ చేయాలి. స్టవ్ పై కడాయి పెట్టి నూనె పోసి వేడి అయిన తర్వాత ఈ ముద్దను చిన్న చిన్న కట్ లెట్ లా చేసి ఎగ్ జ్యూస్ లో లైట్ గా ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీయాలి. వేడి వేడిగా తింటే బాగుంటాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|