|
|
Articles: Recipes | ఫిష్ బుల్లెట్స్ - Site Administrator
| |
కావలసిన పదార్థాలు :
చేపలు : అర కిలో
కోడి గుడ్లు :రెండు
ఫిష్ పాక్ : ఒకటిన్నర కప్పు
నిమ్మకాయలు : రెండు
బ్రెడ్ స్లయిస్‌లు : పదిహేను
సెనగ పిండి : 200 గ్రాములు
ఉల్లికాడల ముక్కలు : పావుకప్పు
మిరియాల పొడి : చిన్న టి స్ఫూన్
నెయ్యి : పావుకేజి
మీగడ : రెండు పావుకప్పు
ఉప్పు... తగినంత
తయారు చేసే విధానం :
ముందు చేపల్ని శుబ్రంచేసి ఆవిరిమీద ఉడకబెట్టి ముళ్లు తీసివేసి వేయాలి. ఒక వెడల్పాటి గిన్నే తీసుకుని అందులో చేపమాంసం వేసి ఉల్లికాడల పేస్ట్‌ను కలిపి తరువాత అందులోనే సెనగపిండి, ఫిష్ స్టాక్‌ను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అలాగే తగినంత, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, మీగడలను కూడా పై మిశ్రమంలోనే కలుపుకోవాలి. ఈ చిన్నచిన్న ఉండలుగా తయారు చేసి ప్లేటులో పెట్టుకోవాలి. మరో గిన్నెలో గుడ్లను గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని పౌడర్లా చేసుకుని ప్లేట్లో ఉంచుకుని, పైన తయారు చేసిన బుల్లట్స్ను ఒకటొకటిగా గుడ్డుసొనలో ముంచి తీసి... బ్రెడ్ పౌడర్‌లో అద్ది, బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేతిలో వేయించాలి. వీటిని టమోటో సాస్, చిల్లీ సాస్ తో కలిపి సర్వ్ చేయాలి. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|