|
|
Articles: Recipes | బ్రెడ్ బోండా - Site Administrator
| |
కావలసిన పదార్ధాలు
బంగాళ దుంపలు : పావుకిలో
పచ్చిబఠాణి : అరకప్పు
ఉల్లిముక్కలు : అరకప్పు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు : 2 స్పూన్లు
సన్నగా తరిగిన కొత్తిమీర : 2 స్పూన్లు
అల్లం వెల్లులి పేస్ట్ : 1 చిన్న స్పూన్
బ్రెడ్ పెద్దది : 1
ఉప్పు : తగినంత
పసుపు చిటికెడు
వేయించడానికి సరిపడ నూనె
తయారుచేయు విధానం
ముందు బంగాళదుంపలు, బఠాణి ఉడకబెట్టుకోవాలి. బంగాళదుంపలు తొక్కవలిచి మెత్తగా చేయాలి. అలాగే బఠాణీ కూడా కచ్చాపచ్చాగా నలపాలి. లేకుంటే మిక్సిజార్ లో వేసి ఒక తిప్పు తిప్పాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, కొతిమీర, అల్లం వేల్లుల్లి పేస్ట్, ఉప్పు పసుపు వేసి కలపాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనే పోయాలి నూనే వేడెక్కే లోపు బ్రెడ్ స్లైజ్ లు తీసుకుని చుట్టుఉన్న బ్రౌన్ కలర్ ను కట్ చేసి నీటిలో వేసి వెంటనే అరచేతుల మధ్యపెట్టి నొక్కి బంగాళదుంప ముద్దను మధ్యలో పెట్టి చుట్టు కవర్ చేయాలి. ఇలా అన్ని చేసుకున్న తరువాత నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వీటిని వేడి వేడిగానే చిల్లిసాస్ తో గాని, టమోటా సాస్ తో గాని, కొబ్బరి చట్నితో గాని తినాలి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|