|
|
Articles: Devotion | సరస్వతీ స్తుతులు - Mr. venkataramayya putrevu
| |
మాతా!శారదా!శారదచంద్రికనంబోలు నీనెమ్మోము
సర్వాలంకారసుశోభితంబై వెల్గొందు నీ దివ్యమంగళ
రూపంబు గాంచి సేవింపగాగల్గుటేనాటి పుణ్యఫలంబొ
పుణ్యగౌతమీతటస్త బాసరక్షేత్రవాసివై వెల్గొందు
బ్రాహ్మిదేవీ!నీశ్రీచరణములే శరణమమ్మా శారదాంబా
మాదువాక్కునన్నిల్చి నిన్నెకీర్తించి సేవింపగాగల్గు
భాగ్యమునంబ్రసాదించి బ్రోవుమోయమ్మా!సరస్వతీ!
బాసరక్షేత్రవాసీ!పద్మజురాణీ!వాణీ!!
గౌతమీజలకంబులన్ స్నానమాడి మముబ్రోవుదైవము
నీవేనని, నీముంగిటన్నిల్చియున్నామమ్మా! సరస్వతీ!సర్వకళారూపిణీ! నీ దివ్యమంగళరూపంబుగాంచగా
మా మనసెంతో ఆరాటపడుచున్నది, మా మనసులోని
మర్మమెరిగి ఈవమ్మా దర్శనంబు, చేయుమోయమ్మా
మాజన్మసఫలంబు బాసరక్షేత్రవాసివై వెల్గొందు
బ్రాహ్మిదేవీ!పద్మజురాణీ!వాణీ!!
సిద్ధి బుద్ధి ప్రదాత్రివై శ్రీలనొసంగు తల్లివీవు
జ్ఞానమొసగెడి నీ చరణయుగళంబె శరణమమ్మామాకు
అవిరలభక్తియుక్తులన్ నిన్నెగొల్చు నీవారమమ్మా
కృపాశాలివై మాదప్పులన్న్ సైచి మమ్మెలుకోవమ్మా
దేవీ!సాహిత్య సంగీత సరసిజాక్షీ! సరస్వతీ
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|