|
|
Articles: Recipes | నిమ్మ మసాల ఊరగాయ - Site Administrator
| |
కావలసిన పదార్ధాలు
నిమ్మకాయలు : 3 కిలోలు
యాలకులు : 60 గ్రా
తెల్లజీలకర్ర : 30 గ్రా
జాపత్రి : 15 గ్రా
జాజికాయ : 1
సైంధవ లవణం : 5 గ్రా
లవంగాయలు : 30 గ్రా
శొంఠి : 60 గ్రా
మిరియాలు : 60 గ్రా
నల్లజీలకర్ర : 30 గ్రా
పిప్పళ్లు : 5 గ్రా
తేజ్ పత్తా : 50 గ్రా
వాము : 30 గ్రా
తయారు చేయువిధానం
నిమ్మకాయలు కాస్త పెద్దవి దోరగా ఉన్నవి ఎంచుకోవాలి. శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. ముప్పావు కిలో నిమ్మకాయలు పక్కన ఉంచి మిగిలిన వాటిని క్రిందభాగం విడిపోకుండా నాలుగుముక్కలుగా కట్ చేయాలి గుత్తివంకాయిలా అన్నమాట.
పైన చెప్పిన పదార్ధాలలో వాము మినహా మిగిలిన సామాగ్రిని మెత్తగా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకుని అప్పుడు పక్కన ఉంచిన వాముని ఇందులో కలపాలి. కట్ చేసి ఉంచుకున్న నిమ్మకాయల్లో ఒకొక్క దానిలో ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న నిమ్మకాయలన్నింటిని జాడిలో పెట్టాలి. మిగిలిన నిమ్మకాయల్ని రసం పిండి కాస్త ఉప్పు కలిపి ఈ నిమ్మకాయలపైన పోయాలి. తరువాత జాడీని ఒక రోజంతా ఎండలో పెట్టాలి. నిమ్మకాయలు ఊరడానికి పదిరోజులు పడుతుంది. ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|