|
|
Articles: Recipes | మామిడి - పొటాటో కర్రి - Site Administrator
| |
కావలసినవి
పచ్చిమామికాయలు : 2
పొటాటో : 1\4 కిలో
పెద్ద ఉల్లిపాయలు : 2
కారం : 2 స్పూన్స్
పసుపు : చిటికెడు
ఎండుమిర్చి : 1
ఆవాలు : : 1\4 స్పూన్
జీలకర్ర : 1\4 స్పూన్
కరివేపాకు : 2 రెమ్మలు
కొత్తిమీర తరుగు : 1స్పూన్
ఉప్పు : తగినంత
నూని : 3 స్పూన్స్
తయారు చేయు విధానం
మామిడి కాయను చెక్కుతీసి మీడియం సైజు ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. పొటాటోలను ఉడికించి మీడియం సైజు ముక్కలు కోయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనే వేసి ఎండుమిర్చి ఆవాలు, జీలకర్ర , కరివేపాకులతో తాలింపు పెట్టి ఉల్లి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇప్పడు మామిడి ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి మగ్గబెట్టాలి. మగ్గిన తరువాత పొటాటో ముక్కల్ని వేసి కారం కూడా వేసి కలియబెట్టి కొద్దిగా నీరుపోసి కూర దగ్గరకు వచ్చిన తరువాత కొత్తిమీరవేసి దించాలి. ఇది రైస్ లోకి, చపాతిలోకి బాగుంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|