|
|
Articles: Recipes | పంజాబీ ఆలు ఫ్రై - Ms. sandya arra
| |
కావలసిన పదార్ధాలు:
బంగాళాదుంపలు అర కిలో
నూనె తగినంత
పెరుగు - ఒక కప్పు, నీళ్లు తగినన్ని
మైదా పిండి ఒక టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్ మూడు స్పూన్స్
అరకప్పు కర్వేపాకు, కొత్తిమీర
ఒక స్పూన్ అల్లం, వెల్లుల్లి
ఒక స్పూన్ కారం
ఒక స్పూన్ మిరియాల పొడి
పది పచ్చిమిర్చిలు
ఉప్పు - తగినంత
ఫుడ్ కలర్ చిటికెడు
తయారు చేసే విధానం :
ముందుగా బంగాళాదుంపలు ఉడికించి ముక్కలుగా కోయాలి. తరువాత ఒక గిన్నెలో నూనె పోసి కార్న్ ఫ్లోర్, మైదా, కారం, మిరియాల పొడి, ఫుడ్ కలర్, ఉప్పు, అల్లం వెల్లులి, పెరుగు కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం గుజ్జులా తయారు చేయాలి.ఇందులో బంగాళా దుంపల ముక్కల్ని ముంచి తీయాలి. పది నిముషాల తరువాత నూనెలో పకోడిలాగా వేయించాలి.
విడిగా ఒక కళాయి తీసుకొని కొంచెం నూనె పోసి కర్వేపాకు, కొత్తిమీర, ఆలు ముక్కలు కూడా వేసి సన్నని సెగ మీద ఉంచాలి. కొద్దిగా నీళ్ళు చల్లి, బాగా వేగిన తరువాత కారం, కొత్తిమీర వేసి దించేయాలి. వీటిని స్నాక్స్ గా గాని రొట్టెలో తింటే బాగుంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|