|
|
Articles: Recipes | బియ్యం ఉప్మా - Site Administrator
| |
Mr.DHARMALINGAM Bennabhaktula
కావలసిన పదార్థాలు :
బియ్యం - 2 గ్లాసులు
ఉల్లిపాయలు - 100 గ్రాములు
పచ్చి మిర్చి - 4 లేక 5
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - 3 టీ స్పూన్స్
చెనగపప్పు - 20 గ్రాములు
మినపప్పు - 20 గ్రాములు
పసుపు -కొద్దిగ
జీలకర్ర - కొంచెం
ఉప్పు తగినంత
నిమ్మ కాయ - ఒకటి
తయారు చేయు విధానం :
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి వేడెక్కినాక మినపప్పు, చెనగపప్పు , జీలకర్ర తో తాలింపు వేయాలి. వీటిలో తరిగి వుంచుకున్న ఉల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత 1 గ్లాసుకు రెండు గ్లాసుల నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరుగుతున్న నీటిలో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కడిగిన బియ్యం వేసి ఉడికించాలి. స్టవ్ మీద నుండి దించిన తరువాత నిమ్మకాయను పిండుకొని తింటే ఎంతో రుచిగా వుంటుంది. వంట చేసుకోవడం కష్టమైనప్పుడు, కూరలు అందుబాటులో లేన్నప్పుడు దీనిని చేసుకొని అప్పుడప్పుడు తినొచ్చు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|