|
|
Articles: My Thoughts | ఈ తెగులు పోతుందా? - Site Administrator
| |
(డా.కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె)
ఒక పది, పదిహేను సంవత్సరాల్లో తెలుగుభాషా వృక్షం కూలిపోతుంది. చిన్న చిన్న తెలుగు దుబ్బలు మాత్రం మిగులుతాయి. ఆ దుబ్బులు పూలు పూయవు, కాయలు కాయవు. నీడనివ్వదు, కనీసం వంట చెరకుగా కూడా పనికిరాదు.
ఏం? ఏమయింది? ఇది వరకూ తెలుగువృక్షానికి చీడ పట్టింది, తెగులు సోకింది. అధికార భాషా సంఘంవారూ, తెలుగు భాషోద్యమ సమాఖ్యవారూ, మరికొన్ని తెలుగు పరిరక్షక సంస్థలూ కలిసి తెలుగువృక్షం పైన చీడమందులూ, పురుగు మందులూ పిచికారీ చేశారు. పరిస్థితి కాస్త చక్కబడింది. కార్యాలయాల్లో తెలుగు వాడకం పెరిగింది. తెలుగు వాడకాన్ని గురించి జీవోలు జారీ అయ్యాయి. ప్రాచీన భాషా ప్రతిపత్తి వచ్చేసింది (కాస్త పెండింగ్ ఉంది కోర్టులో అంతే). మరెందుకు దిగులు! తెలుగు చెట్టు ఎందుకు పడిపోతుంది?
నిజమే, చీడ మందులూ, పురుగుమందులూ చల్లుతున్నారు. ఆకులూ, రెమ్మలూ తెప్పరిల్లుకుంటున్నాయి.
కాని ఆ చెట్లు వేర్లు తెగిపోతున్నాయి. వేరు పురుగులు, ఎలుకలూ చేరి చెట్టు వేర్లను కొరికేస్తున్నాయి. కొమ్మలకు, ఆకులకూ, నీరూ, ఎరువూ అందడం లేదు. ఏవీ? వేరు పురుగులూ, ఎలుకలూ ఏవీ - ఎక్కడున్నాయి?
అదిగో ఆ కాన్వెంటులే వేరు పురుగులు. ఆ ఇంగ్లీషు మీడియం ప్రాథమిక పాఠశాలలే ఎలుకలు. ఇవి తెలుగు చెట్టును వేర్లవద్ద కొరికేస్తున్నాయి. ఇక చెట్టు ఏ ఆధారంతో బతుకుతుంది? ఎట్లా నిలబడుతుంది?
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|