|
|
Articles: Poetry | కృతి ఆది అవస్థ! - Site Administrator
| |
(నిఖిలేశ్వర్)
ఒక సంక్లిష్ట సమాసంలో ఈ సమాజం
తన చుట్టూ తానే తిరుగుతూ
తిరగబడుతూ - తలకిందులవుతూ
ఎన్ని సంధి దశలు దాటినా
మళ్ళీ మరో సంధి దశ...!
ఈ దీర్ఘ యాత్రలో సమాంతరంగానే
అంతులేని దు:ఖ గాధ
అర్థం కాని ఒక అంతర్ ఘోష!
పంచుకోగలిగే బాధలున్నా
ఈ జీవనకృతి ఎవరికి
అంకితమివ్వాలో తెలియదు
ఇక ఏకాంతపు లోగిలిలో
ఒంటరి రొద ఎవరికి వినపడేను?
మనిషి జీవితం
మరణం కంటే ప్రమాదమా అంటే
ఈ జీవితమే కొనసాగే ఒక రచన!
కృత్యాద్యవస్థలోంచి
సంకెళ్ళు తెంచుకునే సంకల్పం
మృత్యువునే జయించే
నవజీవనకృతి
ఆదిలో ఎన్ని అవస్థలైనా
ఎదురీదక తప్పదు!!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|