|
|
Articles: Poetry | సగటు మనిషి - Site Administrator
| |
(సప్రం గణేష్ బాబు)
తనకీ నాకూ గొడవెప్పుడొచ్చిపడిందో తెలియదు కాని
తనెప్పుడూ నా మీద గుర్రుగానే ఉంటుంది.
తన కోపాన్ని భరించాలంటే కష్టంగా ఉన్నా
తను లేకుండా బ్రతకటం అసంభవమని మాత్రం తెలుసు.
చేతులకు తన స్పర్శ తగిలితే
ఏదో తెలియని ధైర్యం నాలోకి పాకినట్లౌతుంది.
కాని తను మాత్రం
ఎంతో నిర్దయంగా నియంతగా నన్ను పాలిస్తూ ఉంటుంది.
ఎప్పుడూ తన దగ్గర నేనోడిపోవడమే కాని
నా దగ్గర తను లొంగిపోయిన క్షణాలు
భూతద్దమేసి వెతికినా దొరకవు.
ఎన్నోసార్లు తను నాకు కన్నీళ్ళను కష్టాలను
అవమానాలను, ఈర్ష్యాద్వేషాలను, తీరని ఆశలను
కానుకగా కట్టబెట్టిందే కాని
నాలో మమేకమైన ఒక సంతోషకరమైన వాస్తవంగా మాత్రం లేదు.
కాని నా జీవితంలో తను...
ప్రాణం తర్వాత ప్రాణం అని మాత్రం చెప్పగలను
ఇదేదో అమర లోకాలకు సంబంధించిన ప్రేమ కాదు
ఈ నేల మీద జీవించడానికి
పంచభూతాల సాక్షిగా ఒప్పుకోవలసిన
ఒకే ఒక అవసరం.
మనిషికి డబ్బుకి ముడిపడిన కవలీకరం
డబ్బు అనే చక్రవర్తిత్వం క్రింద బానిస రాజరికం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|