కాకి అరచినా
అరవకపోయినా
బంధువే..
తిరుపతి వాసులు కదా..
కష్టం - సుఖం
సరితూగాలంటే..
బాధే సౌఖ్యమనే
భావన చాలు..
గ్రహణం - అమావాస్య
చీకట్లో చంద్రునికేనా..
నల్లకోటులో
న్యాయానిక్కూడ..
సిటి బస్ నుండి
అంతరిక్షం దాకా..
అలవోకగా
ఝాన్ సీ అంశలు - అతివలు..
తాళం లేని ఇల్లు..
దేవుడు - జీవుడు తప్ప
చొరబడని సౌధం..
ఈ దేహం..