|
|
Articles: Poetry | ముసుగు - Dr. Raghotham Reddy Pinninti
| |
ముసుగులు వేసుకు బ్రతకడం
లేని ప్రేమలు కుమ్మరించడం
కృత్రిమ నవ్వులు చిలకరించడం
రోజు వీటితో ప్రయాణిచడం
ఎటు వేపు వెళుతున్నాం మనం?
నాగరికతను నరుకుకుంటూ
పునాదులు లేని సంస్కృతిని కోరుకుంటూ
దేని కోసమని పరుగులు పెడుతున్నాం ?
ఆస్తుల అన్తస్థులలో మిమ్మల్ని మీరే బంధించుకుంటే
పక్కవాడూ మనలాంటి మనిషేనని మరిచిపోయి బ్రతుకుతుంటే
శవాలు కలుసుకున్నట్లు... కబుర్లు చెప్పుకున్నట్లుంది కదూ?
నీ అవసరం చుట్టూ నువ్వు పెట్టే పరుగు
నీవొక్కడ్నే మిగిల్చి వెళితే
నీతో నీవే మాట్లాడుకోవాలెమో!
నోట్ల కట్టల పరుపుమంచం
నిదురను నీకందించక
ఎరుపెక్కిన నీ కళ్ళలో
బరువైపోతున్న నీ బ్రతుకు కనిపిస్తోంది
నీలోని నీవాడు చెప్పేది కూడా నువ్వు వినకపోతే
నీవు బ్రతికున్నట్లా...లేక...?
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|