'అహింస' అంటూ
గాంధీ చేతిలో 'కర్ర'..
జాతీయ పతాకాన్ని
ఎగురవేసింది..
జన వాహినిలో
ఏడాదికోసారి
విరిసే 'పద్మా'లు..
భారత సౌరభాలు..
ఆప్యాయతా ఒడిలో
తడిసిన బాల్యం..
విశ్వ - భారతిలో
వ్యక్తిత్వ వృక్షం..
గాలినే కాదు
ప్రేమనూ పీలుస్తూ..
సాగే మనుగడే..
మన భారతీయత..
పెద్దల మాట
ఉలిలా మలచి
జీవితం నిలుస్తుంది
సజీవ శిల్పమై..