|
|
Articles: Poetry | ఎవరికి చెప్పాలి? - Site Administrator
| |
(సప్రం గణేష్ బాబు)
ఆశలకు ఆశయాలకు రెక్కలొచ్చి
విదేశీ చెట్టు మీద వాలితే
తీర్చలేని విషాదం విస్ఫోటనం
కన్నీటి మేఘాలెక్కి
ఆప్తుల గుండెలను తాకుతున్నాయి.
చెయ్యెవరిదైనా కత్తేదైనా
రుచి మరిగింది నెత్తురునే
శరీరాన్ని పూడ్చడానికి
నేలేదైనా ఆరడుగులు సరిపోతుంది.
కానీ - జ్ఞాపకాలని ఏమార్చడానికి
జీవితకాలం సరిపోతుందో లేదో
ఏ ముప్పు ఏ మూల నక్కుందో
ఏ అభద్రత ఏ నీడగా మారి
మన వెనకే తిరుగుతోందో
అర్ధాంతరంగా చచ్చిపోయేదాక
మనకే తెలియదు.
సంద్రాలు దాటివెళ్ళి
చలనం లేని మాంసంముద్దలుగా మళ్ళితే
నేరం ఎవరిదని కారణాలు వెతగ్గలరు కాని
రాలిన ఏ పువ్వునూ
కొమ్మతల్లికి అందివ్వలేరు.
అలలు తీరాన్ని తాకి వెళతాయి
కాని, గుర్తులు
జీవితాన్ని ముంచి తడిపేస్తాయి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|