|
|
Articles: Poetry | ప్రేమ వింత - 2 - Miss kumari kumari
| |
గాయాలను మానిపే
ఆ 'కాలం'
మనసు గాయాలను
పట్టించుకోనంటూంటుంది ఎందుకు?
మరణాన్ని సైతం ఎదిరిస్తానన్న
ఆ 'ధైర్యం'
పెళ్ళిని పెద్దల చేతుల్లో
ఉంచుతూంటుంది ఎందుకు?
నరకానిక్కూడ సిద్ధం అన్న
ఆ 'రోజులు'
ప్రేమను పెళ్ళి వరకు
వెళ్ళనీయనంటూంటుంది ఎందుకు?
తలచుకుంటేనే ముసురుకునే
ఆ 'సిగ్గు'
మరచిపొమ్మన్నా, సిగ్గు లేకుండా
బ్రతికేస్తూంటుంది ఎందుకు?
హద్దు ఎల్లలు ఎరుగవు అన్న
ఆ 'బంధం'
జాతకచక్రాలు కలవాల్సిందే
అంటూంటుంది ఎందుకు?
పంచ ప్రాణాలు - ఆరో ప్రాణం అన్న
ఆ 'మనిషి'
దాడులు చేసి మరీ ప్రాణం తీసే మృగంగా
మారుతుంటుంటాడు ఎందుకు?
నీవు లేక నేను లేను అన్న
ఆ 'బాసలు'
పెళ్ళిని విడాకులుగా
మార్చేస్తూంటుంది ఎందుకు?
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|