|
|
Articles: Devotion | చిక్కులన్ని తీర్చురా - Mr. Asharam Sohni
| |
చదువు చదువులకెల్ల
సారమైన చదువు
సాయిదత్త చరితము
చక్కనైన గ్రంథము
ఈ జన్మ వట్టిది
సజన్మ గట్టిది
సంసార బంధాలను
శ్రీ సాయి త్రెంచును.
మాయ మనసును విడచి
మందబుద్ధిని మరచి
సాయి సేవ చేయరా
బాబాను మనసులొ నిలపరా
అంతరాత్మ యందు
ఆది దైవము కొరకు
సాయి నామము పలకరా
గురుచరితము చదవరా
భోగాలు విడచినా
రోగాలు విడుచును
చిక్కులన్నియు దీర్చునురా
చింతలన్నీ బాపునురా.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|