|
|
Articles: Poetry | మూడు - Site Administrator
| |
(కె. శోభారాణి)
అనాదిగా
మూడు అంకెకు మహిళకు
అవినాభావ సంబంధమున్నది
మూడుముళ్ళతో
మాట మాటాడకుండా కట్టి పడేస్తారు
ఆకాశంలో సగమైనా
అవకాశాలు అరకొరలె
పెళ్ళి పిల్లలు
చాకిరీ తర్వాత
చదువు పెంచుకోవటాన్కి
మిగిలిన తీరికా - కోరికా కాస్తా ఆవిరైపోతుంది
పురుషాధిపత్య
భావజాలంతో పాటు అణచివేతకు
వెనుకబడటానికి
సవాలక్ష కారణాలు
జనాభాలో సగమైనా
అర్ధశరీరమైనా
రిజర్వేషన్లలో మాత్రం
ముచ్చటగా ముప్పైమూడు శాతమే
వెలలేని
స్త్రీమూర్తి సేవలకు
ఇప్పటికైనా
ఓ విలువకట్టింది ఉన్నత న్యాయస్థానం
ముడు వేలంటూ
రవ్వంత గుర్తింపుకే
పొంగిపోయే అల్పసంతోషి కదా!
ఈ చిరు కదలిక మరింతగా విస్తరించాలని
మహిళకు ఇంకింతగా ఉపయోగించాలే తప్ప
చూపుకు నష్టపరిహారంగా గోరంత అకృత్యానికి సైతం
తావునియ్యక
కొండంత అండగా నిలబడాలి
ఈ తీర్పు... ఓ దార్పుగా...
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|