|
|
Articles: Poetry | జనప్రియా రాజశేఖరా! - Site Administrator
| |
(మనోజ్ చరపనంజేరి)
మృత్యు దేవత పిలుపు నీకు
ప్రజా ఘోష లాగ వినిపించిందా?
వెలుగుతున్న నీ ప్రభ చూసి
ఏ దేవతకైన కన్ను కుట్టిందా?
ఎవరికీ చెప్పకుండా
రమ్మని పిలిచింది రచ్చబండ
కానీ, నీ అకాల నిష్క్రమణకు
శకటమైంది పావురాలగుట్ట
నీ ఆరోగ్యశ్రీ లబ్ధిదారునికి
నీవు తరతరాల ఇష్టదైవం!
నీ జలయజ్ఞంలో
పులకించిన పుడమి తల్లికి
నీవు ప్రియ నేస్తమ్!
నీ ఇందిరమ్మ ఇళ్ళు
ఆంధ్ర గ్రామరాజ్య ప్రగతికి మెట్లు!
నీ సంక్షేమ పథకాలు
ఆంధ్ర ప్రజ నీకు తీర్చుకోలేని రుణాలు!
జన ప్రియా! జన హితా! ఓ రాజశేఖరా!
ఆజన్మాంతము ఆంధ్రావని నిను మరువబోదురా!
email : cjeri@yahoo.com
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|