|
|
Articles: Devotion | దేవీ వందనం - Mr. venkataramayya putrevu
| |
రండు రండు జనులారా చూడగ రారండీ
చూచి తరింపగ రారండీ!
త్రిజగన్మోహినీ త్రిసూలధారిణీ త్రినేత్రోజ్వల
కాంతిప్రభాభాసమాన, త్రైలోక్యకుటుంబినీ
ఆ మహిషాసురమర్ధినిన్, జగత్కళ్యాణార్ధమై
దివిన్నవతరించిన ఆ ఆదిపరాశక్తిన్ చూడగ
రారండీ, చూచి తరింపగ రారండీ! జనులారా!!
శరన్నవరాత్రులన్, సర్వాలంకారశోభితయై
పల్లెపల్లెల వాడవాడల నవనామాంకితయై
నవావతారముల్దాల్చి నిత్యపూజలందుకొనుచున్న
నిరుపమగుణసాంద్ర, సర్వమంగళదాయినీ, ఆ
నారాయణిని చూడగ రారండీ చూచి తరింపగ రారండీ
జనులారా!!
కొలిచే వారికి కొంగుబంగారమై కైవల్యపదదాయినియై
కైలాసంబున నుండి భువికేతేంచిన కరుణాంతరంగ
ఆ కాత్యాయనిన్ చూడగ రారండి చూచి తరింపగ రారండి!!
ఏనాటి పుణ్యఫలమో నేటి ఈ సందర్శనాభాగ్యంబు
కనులార గాంచి మనసార సేవించి శరణు శరణని
శరణుజొచ్చెదమురండు రండు రండు జనులారా
చూడగరారండీ చూచి తరింపగ రారండీ జనులారా!!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|