చందమామ నుంచి
వెన్నెలనంతా దొంగిలించి
నీ కన్నుల్లో దాచావా...
అమ్మా!
అది నాపై కురిపిస్తున్నావా
పొత్తిళ్ళలోని పాపాయిగా
ఉన్నపుడే...అమ్మా!
నీ స్పర్శనే అనుభూతి చెందానే
ఆ తీపి ఙ్ఞాపకం
నన్నింతదాన్ని చేసినా
ఒక్క క్షణం
నీ ఒడిని ఒదిగి ఉండాలనుకుంటా
కాబోయే అమ్మగా...
నా పాపాయికీ పంచుకుంటా...