|
|
Articles: TP Features | విశ్వ వేదిక 'మ్యూజిగుల్' - Site Administrator
| |
(వరప్రసాద్ గాలిదేవర)
వేల పాటలు రాసి, గానం చేసి, పండిత పామర జన హృదయాలలో వందల సంవత్సరాలుగా పాటను అమరంగా నిలపిన పదకవితా పితామహుడు అన్నమయ్య కంటే వంద పాటలు కూడా పాడని మైకేల్ జాక్సన్ మన వాళ్ళకు బాగా తెలుసు... ఎందుకనీ?
పది కోట్ల మంది ఆంధ్రులం...
సప్తస్వరాల సంగీత సాగరం...
కోటి రాగాల అమృతకలశం... సర్లెండి.
మరి ఈ నేలపై ఎంతమంది ప్రతిభావంతులైన గాయకులు, రచయితలు, సంగీత దర్శకులు ఉన్నారో తడుముకోకుండా చెప్పగలరా? మహా అయితే పట్టుమని పది మంది పేర్లు గుర్తుకు రాకపోవచ్చు.... ఎందుకనీ?
జానెత్ జాక్సన్ లు.. మడొన్నాలు... షకీరాలు పెదవులపై ఆడతారు. కమ్మని గొంతుతో మనదైన పాటను వీనుల విందుగా వినిపించేవాళ్ళను గురించి మనకు తెలియకపోవడానికి కారణం ఏమిటీ?
ఇలాంటి ప్రశ్నలనే సూటిగా అడుగుతారు కూచిభొట్ల ఆనంద్...
విశ్వ వేదికపై తెలుగు సాహిత్య, సంగీత, సాంస్కృతిక వైభవాన్ని పరికిస్తున్నవారికి కూచిభొట్ల ఆనంద్ ఎవరో తెలుసు. 'సిలికానాంధ్ర' ఆనంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంటా...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|