|
|
Articles: Poetry | తల్లి వేరు - Site Administrator
| |
(పిఎస్ నాగరాజు)
తల్లి వేరు తెగిపోతే
ఆకుపచ్చ పాట ఎలా ఎదిగి వస్తుంది?
అమ్మ భాష చితికిపోతే
బతుకు బాట పాట ఎలా ఎరుక వస్తుంది?
మట్టిలో మూలాల్ని వెదికి చూసుకో!
చెమట మబ్బులో చలనాన్ని ఒడిసిపట్టుకో!
ఉగ్గుపాల సారమిగిరిపోతే
నాల్క మీద మాట ఎలా నడిచి వస్తుంది?
ప్రజల భాష జాడ చెరిగిపోతే
రక్త ఘోష వికాసం ఎలా ఎదను తడుతుంది?
నేల చాళ్ళ నరాల వికసించే అక్షరాన్ని పొదువుకో!
కాలరేఖ తీరాన ఉదయించే
తెలుగు వెలుగు నిపుకో!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|