|
|
Articles: Poetry | కోపం - divya tummala
| |
కోపమెంత చెడ్డది
మనసు ఎంత పిచ్చిది
కోపంతో రగిలే మనసు అగ్నికణిక వంటిది
ఆ అగ్నికి ఆజ్యం పోసే మాట ఈటె లాంటిది
ఆవేశం అతిశయించగ ఆలోచన లోపించెను
ఈ విషయం విదితమైన పిచ్చి మనసు కోపించెను
ఆగ్రహాన అగ్రహారపు బ్రాహ్మణుడే వీధి శునకమై
తన పూజల సారం మరిచి దూషించును తాను భ్రష్టుడై
రౌద్రమున సత్యము కానక
పరితపించు తానె ఆనక
అయినా తన నిజం వదలక
ప్రతి మనిషీ చూపును కినుక
విశ్వాన ప్రాణుల కదలిక ఆ ఈశుని ఆటే కనుక
బ్రతకాలి నవ్వుతూ ప్రతి దానికి చివ్వ చేయక
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|