|
|
Articles: Poetry | ఎవరు నీవెవరు - divya tummala
| |
ఎవరని నేనెవరని
ఎవరికి ఎవరు ఏమని
ఒకరికి ఒకరు ఎవరని
ఎవరిని నేనెవరిని
బాంధవ్యాల బందిఖానాలో బందీనైన జీవాత్మని
ఐహిక సుఖాల రంగుల త్రాటికి చిక్కిన ఓ అగ్నిని
స్వార్ధం లోభం నిండిన లోకం ఆహ్వానిస్తే వచ్చిన అతిథిని
క్షణభంగురమౌ దేహం కోసం తపించే నేనొక వెర్రిని
నేను నాదను ఉన్మాదంతో క్రోధం హెచ్చి
సత్యం నిత్యం అయిన ఆత్మను ఎన్నడో మరిచి
దేహమే నిజమని
ఈ లోకమే శాశ్వతమని
నమ్మే నేను ఓ సగటు మనిషిని
అందుకే అడగకండి ఇంకెప్పుడూ
ఎవరు నువ్వెవరని!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|