|
|
Articles: Poetry | ఆకాశమే రాయబారి - divya tummala
| |
సంధ్యా వర్ణాలు సింగారాలై ఉన్న ఆకాశం
మది ఆలపించెను మధుర గీతాలు నీకిది విదితమా
చెలియ చెక్కిళ్ళలో అరుణం
తన తలపే ఎంతో మధురం
తేనెలు తొణికే అధరం
తన పలుకే సుధలకు నిలయం
మమతల నెలవై హృదయం
సొగసుల కొలువై దేహం
కాంత వీక్షణమే అయస్కాంతం
ఆమె ఉనికే ఓ అద్భుతం
కనులలోని కలలు ఎప్పుడూ కలలుగా ఉండవని
కలలైనా ఎపుడో అపుడు నిజములై కదులునని
నమ్మలేదు నేను ఎప్పుడూ కలలు నిజాలౌతాయని
నమ్మేలా చేస్తోందిపుడు అరుదైన ఈ జవ్వని
సంధ్యా వర్ణాలు సింగారాలై ఉన్న ఆకాశం
మది ఆలపిస్తున్న ప్రేమ గీతాలు తనకు నువు తెలుపుమా
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|