|
|
Articles: Poetry | మృతజీవి - Mrs. sujatha Thimmana
| |
కనులు చూసిన వాస్తవం
చెవులు విన్న సత్యం
గుండెను చేరినా...
గొంతులో సమాధి చేసి
కదపలేని పెదవులు
మూగవైనాయి
చరించే మృతజీవి అయి
కాలం గడుపుతున్నాడు మానవుడు
మనసు... మమత
ఆత్మీయత... అనురాగం
మమకారం... మానవత
నిఘంటువులో అర్థాలు
వెతికే పదాలయినాయి
పైసా ఉంటే పరపతి
ప్రపంచమంతా పడుతుంది
అతనికి హారతి
ఏడుకొండల వెంకన్న సైతం
వజ్రాల లంచం పుచ్చుకొని
మౌనివలే మందహాసి అయినాడు
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|