|
|
Articles: Devotion | శివాష్టకం - Site Administrator
| |
కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాధం సదానందభాజం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభు మీశాన మీడే
గళే దండమాలం తనౌ సర్పజాలం
మహాకాలకాలం గణేశాదిపాలం
జటాజూటగంగోత్తరంగై ర్విశాలం
శివం శంకరం శంభు మీశాన మీడే
ముదా మాకరం మండనం మమండయంతం
మహామండలం భస్మభూషాధరం తమ్
అనాదిం హ్యపారం మహామోహమారం
శివం శంకరం శంభు మీశాన మీడే
వటాధో నివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం
శివం శంకరం శంభు మీశాన మీడే
గిరీంద్రాత్మజాసంగృహీర్ధదేహమ్
గిరౌ సంస్థితం సర్పహారం సురేశం
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం
శివం శంకరం శంభు మీశాన మీడే
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానం
బలీవర్దయానం సురాణం ప్రధానం
శివం శంకరం శంభు మీశాన మీడే
శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణాకళత్రం సదా సచ్చిరిత్రం
శివం శంకరం శంభు మీశాన మీడే
హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శశ్మానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభు మీశాన మీడే
ఇతి శ్రీ శివాష్టకం
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|