|
|
Articles: Devotion | ఆత్మ విచారణ - Site Administrator
| |
(భారం ఉమా మహేశ్వరరావు)
పరిపక్వ భావమును దైవమునందు సాధించుకొని ఏకాగ్రతను పొందిన, ధ్యానమునందు ఆసక్తి కలిగి విశ్వశక్తిని సంపాదించగలరు. ఏకాగ్రత సంపాదించవలయునంటే మీలో ఉన్న శక్తులన్నిటిపై ఆధిపత్యము పొందగలిగి ఉండాలి. ఏకాగ్రత అంటే అన్ని వైపులకు పోయే ఆలోచనలను ఏకభావములో తెచ్చుకొనుటయే. ఆథ్యాత్మిక ప్రగతి సాధించవలయునంటే, ఎన్ని గంటలు ధ్యానము చేసినది ముఖ్యము కాదు. ఏకాగ్రతతో చేసినదే నిత్యము.
ధ్యానము వలన నువ్వు ఏమి సాధించగలగావో ఈ ప్రశ్నల సమాధానముల ద్వారా ఆత్మ విచారణ చేసికొని ఆథ్యాత్మికముగా నీవు ఎంత ఎదిగినావో తెలుసుకో.
నీ ఉపాసనజ్ఞాతమా - అజ్ఞాతమా?
ముముక్షత్వము ధర్మమా లేక గుణమా?
'తత్వమసి' అనే వాక్యము స్తుతి పరమా, ఉపాసనా లేక జ్ఞానపరమా, ఎందువలన?
బింబ ప్రతి బింబముల రెంటి యొక్క రూపమలు బేధమా - అబేధమా?
ధ్యానములో మనస్సును ఆత్మలో లయము చేసుకొన్న మనస్సు జ్ఞానమును ఏ విధముగా పొందగలదు?
ఒక పెద్ద భవంతిలో మూడు నదులలోన ప్రవహించుచూ వంట గదిలో కలియుచున్నవి. అచ్చట వండిన భోజన పదార్థములను భుజించుటకు ఈ మూడు నదులను దాటి వెళ్ళవలయును. అది ఎట్లు సాధ్యము?
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|